Sunday, April 6, 2025

బిజెపి కర్నాటక ఎన్నికల మేనిఫెస్టో అంతా బోగస్: సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

గడగ్(కర్నాటక): రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య ‘బోగస్’ అని విమర్శించారు. ఇదివరకటి ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయడంలోనే ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది అన్నారు.

గడగ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మేము మా మేనిఫెస్టో రేపు విడుదల చేయబోతున్నాము. బిజెపి వారి మేనిఫెస్టో బోగస్‌ది. మేము విడుదల చేసే మా మేనిఫెస్టో అమలు చేయగలిగేది. అదే కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య ఉన్న వ్యత్యాసం. 2018లో బిజెపి 600 హామీలు చేసింది. కానీ అమలు చేసింది కేవలం 55 మాత్రమే. మేము 165 హామీలు చేశాము. వాటిలో 158 నెరవేర్చాము. అదే తేడా’ అని వివరించారు.

కాంగ్రెస్ కర్నాటకలో తన మేనిఫెస్టోను మంగళవారం ఉదయం 9.00 గంటలకు విడుదల చేయనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News