Sunday, January 19, 2025

ఖమ్మం బహిరంగ సభ రద్దు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం బహిరంగ సభ రద్దు
బిఫర్‌జాయ్ తుఫాన్ కారణంగా అమిత్‌షా పర్యటన రద్దు
ఈనెల 25న నాగర్ కర్నూల్ సభ యథావిధిగా నిర్వహణ
సభ వాయిదాతో శ్రేణులు నిరాశ పడవద్దు: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి
మన తెలంగాణ/హైదరాబాద్: నేడు ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభ గుజరాత్, మహారాష్ట్రలో బిపర్ జాయ్ తుఫాన్ కారణంగా రద్దు చేసినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు నిరాశ చెందవద్దని పిలుపునిచ్చారు. ఈనెల 25న నాగర్‌కర్నూల్ జరిగే జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సభ యథావిధిగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా 24 గంటలపాటు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున బహిరంగ సభకు రాలేకపోతున్నారని తెలిపారు.

ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను ఇప్పటికే తుఫాన్ బాధిత ప్రాంతాలకు పంపారని, రైళ్లన్నీ రద్దు చేసి దాదాపు 50 వేల మందిని ఆ ప్రాంతాల నుండి మరో ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రేపటి పరిస్థితిని అంచనా వేసినట్లు ఈ విపత్కర సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సముచితం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. వాస్తవానికి బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పార్టీ సీనియర్ నేతలంతా అక్కడే మకాం వేసి పెద్ద ఎత్తున జనం తరలించేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. అతి త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తామని అప్పటివరకు కార్యకర్తలు స్దానిక ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల కోసం పోరాటం చేయాలని సూచించారు.

కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు: కేంద్ర హోంశాఖ ప్రకటన
తెలంగాణలో పార్టీ బలోపేతం చేసేందుకు బిజెపి అగ్రనాయకత్వం రాష్రంలో తిష్టవేసి క్యాడర్‌లో జోష్ నింపేందుకు బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. ఈనెల 15న ఖమ్మంలో సభ నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర నాయకులు ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్ధరాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శంషాబాద్ విమానశ్రయానికి చేరుకుని అక్కడే బస చేసి గురువారం ఉదయం దర్శకుడు రాజమౌళి, వేమూరి రాధాకృష్ణ నివాసాలకు వెళ్లనున్నారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు శ్రేణులు అన్ని సిద్దం చేసుకున్నారు. బుధవారం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బిపర్‌జాయ్ తుఫాన్ ప్రభావం ఉండటంతో పర్యటన రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News