Monday, December 23, 2024

పేద ప్రజల సంక్షేమమే బిజెపి ధ్యేయం

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్ : పేద ప్రజల సంక్షేమమే బిజెపి ధ్యేయమని అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. మహాజన్ సంపర్క్ అభిమాన్ కార్యక్రమంలో బాగంగా మంగళవారం పట్టణంలోని 7వ బూత్ పరిధితో ఇంటింటికి బిజేపి కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రదాని మోడీ నేతృత్వంలో 9 సంవత్సరాలలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు పరుస్తున్న పలు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకు ముందు పట్టణంలోని సీనియర్ బిజెపి నాయకురాలు సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల నివాసంలో మేరా బూత్ మజు బూత్ కార్యక్రమం ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం వీక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాల్‌రావు, బిజేపి పట్టణ అద్యక్షుడు బత్తుల శంకర్ బాబు, మహిళా మోర్చా జిల్లా ప్రదాన కార్యదర్శి తోట స్వరూప, కాదాసు దీపిక, లకావత్ శారద, గాదాసు రాంప్రసాద్, లింగారెడ్డి, కందుకూరి సతీష్, లింగారెడ్డి, తోట సమ్మయ్య, బొప్పిశెట్టి బీమేశ్వర్, ఆషాడపు శ్రీనివాస్, బుడిగే వెంకటేశ్, అనుమోజు ఆంజనేయులు , కోమటి సత్యనారాయణ , అక్కు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News