Wednesday, January 22, 2025

ఢిల్లీలో నూపుర్ శర్మ కోసం వెతుకుతున్న ముంబై పోలీసులు

- Advertisement -
- Advertisement -
Nupur Sharma lookout
నూపుర్ శర్మ కోసం ముంబై పోలీసు బృందం గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసింది.

న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కు గురైన బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఒక వార్తా ఛానెల్‌లో మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో ఆమెపై పోలీసు కేసులు నమోదై చాలా రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించడంలేదు. ముస్లిం సంస్థ రజా అకాడమీ జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఢిల్లీ నివాసి శర్మపై మే 28న కేసు నమోదు చేశారు.

శ్రీమతి శర్మను ప్రశ్నించడానికి ఢిల్లీకి వచ్చిన ముంబై పోలీసు బృందం ఆమెను కనుగొనలేకపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆమె జాడ తెలియకుండా పోయిందని వారు తెలిపారు.

బిజెపి మాజీ అధికార ప్రతినిధిని అరెస్టు చేసేందుకు ముంబై పోలీసుల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ముంబై పోలీసు బృందం గత ఐదు రోజులుగా దేశ రాజధానిలో ఉండి, శ్రీమతి శర్మ కోసం వెతుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ అబుల్ సోహైల్ ఫిర్యాదు ఆధారంగా కోల్‌కతా పోలీసులు దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేదా ఎఫ్‌ఐఆర్‌ను కూడా శ్రీమతి శర్మ ఎదుర్కొన్నారు. కోల్‌కతా పోలీసులు జూన్ 20న ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు సమన్లు ​​జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలపై శ్రీమతి శర్మపై ఢిల్లీ పోలీసులు మరో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ముహమ్మద్ ప్రవక్తపై టివిలో ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్ , సౌదీ అరేబియాతో సహా కనీసం 15 దేశాల నుండి తీవ్ర ప్రతిస్పందనలు , అధికారిక నిరసనలు రావడంతో శ్రీమతి శర్మను బిజెపి సస్పెండ్ చేసింది. అనేక గల్ఫ్ దేశాలు భారతీయ రాయబారులను పిలిపించి, బిజెపి అధికార ప్రతినిధుల “ఇస్లాం వ్యతిరేక ప్రకటనలు” అని  చెప్పే వ్యాఖ్యలను ఖండించాయి.

శ్రీమతి శర్మ తన ప్రకటనను “బేషరతుగా” ఉపసంహరించుకున్నారు, “మా మహాదేవ్ (శివుడు) పట్ల నిరంతర అవమానం, అగౌరవానికి తాను ప్రతిస్పందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా బిజెపి ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు సర్ది చెప్పే, బుజ్జగించే ప్రయత్నాలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News