Monday, December 23, 2024

నవంబర్ 1న బిజెపి మూడో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

జనసేన పొత్తుపై ఆ పార్టీ నేతలతో చర్చలు
ఎంపి ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేయడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్: నవంబర్ 1న బిజెపి అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులను జాబితా ప్రకటిస్తున్నామని జనసేనతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎన్డీయేలో జనసేన భాగస్వామ్య పార్టీ అని తమ పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదన్నారు. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన ప్రభుత్వం చేయకపోవడం బాధకరమని, దీంతో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు అనేక రకాలుగా నష్టపోయారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అధికారం చేపట్టిన వెంటనే టిఎస్‌పిఎస్పీలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో పేపరు లీకేజీలు కాకుండా కొత్త నిబంధనలు తీసుకొస్తామని, నిరుద్యోగ యువత ఈసారి బిజెపికి మద్దతు పలకాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News