Monday, December 23, 2024

బిజెపి ఓటు బ్యాంక్ తగ్గలేదు : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి బిఆర్‌ఎస్ సహకరించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసిందని విమర్శించారు. ఢిల్లీలో ఆ రెండు పార్టీలకు చెందిన మనుషులు కలుసుకుంటారని.. కర్ణాటక ఎన్నికల్లో మనస్సులు కలిశాయని ఆరోపించారు.

కర్ణాటకలో ఓ వర్గం ఓట్లన్నీ గుంపగుత్తగా కాంగ్రెస్‌కు పడ్డాయని.. ఇందుకు జెడిఎస్ సహకరించిందని మండిపడ్డారు. కర్ణాటకలో బిజెపి ఓటు బ్యాంకు తగ్గలేదని సీట్లు మాత్రమే తగ్గాయని వెల్లడించారు. తమకు గత ఎన్నికలలో మాదిరిగానే ఈ సారి ఎన్నికల్లో 36 శాతం ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో 38 శాతం ఓట్లు 80 సీట్లు వస్తే… ఈసారి 43 శాతం ఓట్లతో 134 సీట్లు గెలుచుకుందని అన్నారు. గతంలో 20 శాతం ఓట్లు తెచ్చుకున్న జెడిఎస్ ఈ సారి 13 శాతానికే పరిమితమైందన్నారు.

జెడిఎస్‌కు పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని చెప్పారు. మజ్లీస్‌తో పాటు నిషేధిత పిఎఫ్‌ఎస్‌ఐ సంస్థకు చెందిన ఎన్డీపీఐ పార్టీ సైతం కాంగ్రెస్ విజయానికి కృషి చేశాయని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, బిఆర్‌ఎస్, కమ్యూనిస్టుల కలిసే పోటీ చేస్తారని అన్నారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు, చాడ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News