Monday, January 20, 2025

బిజెపి గెలుపు.. ప్రజలకు లాభం : ఈటల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తనపై విశ్వాసంతో రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ అంతరంగం, సమస్యలు పూర్తిగా తెలిసిన వాడిని. ముఖ్యమంత్రి కెసిఆర్ బలం, బలహీనతపై అవగాహన ఉన్నోడిని. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తా. కిషన్‌రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనతో కలిసి పని చేస్తా. బిఆర్‌ఎస్‌ను ఓడించడం బిజెపితోనే సాధ్యం. బండి సంజయ్ నేతృత్వంలో నాలుగు ఎన్నికలు గెలిచాం. రాష్ట్రంలో గెలిస్తే బిజెపి.. లేదంటే బిఆర్‌ఎస్ గెలిచాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ ఎన్నికనూ గెలవలేదు. బిఆర్‌ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభం. బిజెపి గెలిస్తే ప్రజలకు లాభం’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీకీ, నడ్డా, అమిత్ షా, సంతోష్‌జీ, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News