Monday, January 20, 2025

బిజెపి విజయ పరంపర మొదలైంది : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ గడ్డ మీద 2019 నుంచి బిజెపి విజయ పరంపర మొదలైందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చే సత్తా బిజెపికి మాత్రమే ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ సభతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్నందన్నారు. ఎన్నో ఏళ్ల కల అయిన వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని అన్నారు. మొదటి సారి ప్రధాని వస్తున్న సందర్భంలో ఘన స్వాగతం పలకాలని ప్రజలను ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బిజెపి జెండా ఎగరాలని అధిష్టానం చెప్పిందని అన్నారు. పార్టీకి బలమైన కేంద్రంగా వరంగల్ జిల్లా ఉందని అన్నారు.

సిఎం కెసిఆర్ లాగా తాము మాట్లాడమన్నారు. పెన్షన్లు 57 ఎండ్లకే ఇస్తా అని ఇవ్వలేదని గుర్తు చేశారు. భర్త చనిపోతే భార్యకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ పై ఆధారపడే కుటుంబాలకు భార్యభర్తలిద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. బిజెపి నేతలు కలిసికట్టుగా ఉన్నారని, కలిసే పనిచేస్తాం, విజయం సాధిస్తామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మేము తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తామని అన్నారు. దేశంలోని స్వార్ధపరులు, స్వార్థ పార్టీలు, నేతల గురించి ప్రజలకు తెలుసని అన్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసని తెలిపారు. మా మీద విషం చిమ్మే ప్రయత్నం కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు చేస్తున్నారని మండిపడ్డారు. చాప కింద నీరులా మేము పని చేసుకుంటున్నామని తెలిపారు. కుట్రలను, కావాలని సృష్టించే ఆరోపణలను తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News