Tuesday, December 24, 2024

ఎమ్మెల్సీ క‌విత ఇంటి ముట్ట‌డికి బిజెవైఎం య‌త్నం

- Advertisement -
- Advertisement -

 

BJYM activists at Kavita house

హైదరాబాద్: ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ కుంభకోణం  హైద‌రాబాద్‌లో ఉద్రిక్త‌త‌ల‌కు తెర తీసింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి  కెసిఆర్ కుటుంబ సభ్యుల‌కు పాత్ర ఉందంటూ బిజెపి ఎంపీ ఒక‌రు ఆదివారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స్కాంలో కెసిఆర్ త‌న‌య క‌విత‌కు ప్ర‌త్య‌క్షంగా పాత్ర ఉందంటూ మ‌రో ఎంపీ కూడా ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను సోమ‌వారం స్వ‌యంగా క‌విత ఖండించారు.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం క‌విత మీడియా స‌మావేశం ముగిశాక అదే రోజు సాయంత్రానికి ఆమె ఇంటి ముట్ట‌డికి బిజెపి యువ‌జ‌న విభాగం బిజెఐఎం నేత‌లు య‌త్నించారు. కాగా ఇలాంటి ఆందోళ‌న‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న అనుమానంలో క‌విత ఇంటి వ‌ద్ద భారీగా బ‌ల‌గాలు మోహ‌రించారు. బిజెవైఎం కార్య‌క‌ర్త‌లు క‌విత ఇంటిలోకి వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా బిజెవైఎం, పోలీసుల మ‌ధ్య తోపులాట చోటుచేసుకుంది. ఫ‌లితంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చివరికి బిజెవైఎం కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News