Monday, December 23, 2024

ప్రగతి భవన్ ముట్టడించిన బిజేవైఎం కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, సిటిబ్యూరో: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజేవైఎం కార్యకర్తలు గురువారం ప్రగతి భవన్‌ను ముట్టడించారు. పెద్ద ఎత్తున బిజెవైఎం కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ముట్టడి నేపథ్యంలో పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. ఒక్కసారిగి బిజెవైఎం కార్యకర్తలు దూసుకురావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన బిజెవైఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బిజెవైఎం నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు బిజెవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా బిజేవైఎం భానుప్రకాష్ మాట్లాడుతూ దేహదారుడ్య పరీక్ష ప్రమాణాలు పెంచడం వల్ల ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులను మనోవేదనకు గురిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లాంగ్ జంప్‌ను 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు కుదించాలని, పాత పద్ధతిలోనే దేహాదారుడ్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News