Tuesday, December 17, 2024

కవిత అరెస్టు కక్షపూరితం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో త న కూతురు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అరెస్ట్ కా వడంపై గులాబీ బాస్ కెసిఆర్ తొలిసారి స్పందించారు. ఢిల్లీ లి క్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదేనని, ముమ్మాటికి కవిత అరెస్ట్ అక్రమని కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొ నుగోలు కేసులో బిజెపి కీలక నేత బిఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించామని,

దీంతో అప్పటి నుండి ప్రధాని మోడీ తనపై కక్ష కట్టారన్నారు. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపించాడని ఆరోపించారు. బిఎల్ సంతోష్‌పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేదన్నారు. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News