Monday, January 20, 2025

నాపై ఆరోపణలు చేసిన వారు.. నిరూపించాలి లేకపోతే నేనేమిటో చూపిస్తా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారంలో తనపై చేసిన వారు నిరూపించాలని బిజెపి జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.ఎల్. సంతోష్ సవాల్ విసిరారు. తానేమిటో చూపిస్తానని, తనపై ఆరోణలు చేసిన వారు పర్యావసనాలు ఎదుర్కొనక తప్పదని ఆయన హెచ్చరించారు. గురువారం హైదరాబాద్ శివారు శామీర్‌పేటలో జరిగిన బిజెపి పార్లమెంట్ విస్తారక్ సమావేశంలో బి.ఎల్. సంతోష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు బిజెపి నేతలతో అంతర్గతంగా ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫాంహౌస్ కేసుపై స్పందించారు. తనపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారని విమర్శించారు. తాను ఎవరనేది ఇక్కడ ఎవరికీ తెలియదని, అలాంటిది తెలంగాణలో ప్రతి ఇంటికీ తన పేరును తీసుకెళ్ళారని అన్నారు. తెలంగాణ తల్లి పేరుతో ఆమెకే ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలంటూ బిఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిఆర్‌పిసి 41ఏ కింద నోటీసులు జారీ చేసిన అధికారులు సిట్ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయినా బిఎల్ సంతోష్ విచారణకు హాజరుకాలేదు. దీంతో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు సంతోష్‌కు మళ్ళీ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి విస్తారక్‌ల సమావేశానికి ఆయన హాజరుకావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News