Saturday, November 23, 2024

ఎవరీ బిఎల్ సంతోష్?

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్ ఫాంహౌస్‌లో కీలక
సుత్రధారిగా గుర్తింపు రాజకీయ
వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన
కర్నాటక కమలం పార్టీ నేత

బెంగళూరు: తెలంగాణలో ఎంఎల్‌ఎల ఎర కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార టిఆర్ ఎస్ ఎంఎల్‌ఎలకు సంబంధించిన ఆపరేషన్ ఫాం హౌస్‌లో లీకైన ఆడియో టేపులు సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. ఈనేపథ్యంలో తెలంగాణ లో రాజకీయ వాతావరణ మరింత వేడెక్కింది. లీ కైన టేపుల్లో సంతోష్ అనే బిజెపి నేతపేరు బయటకు వచ్చింది. దీంతో ఎవరీ సంతో ష్ అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో తలెత్తింది. ఈడి, సిబిఐల నుంచి బిఎల్ సంతోష్ రక్షిస్తారని ఎంఎల్ ఎ పైలట్ రోహిత్‌రెడ్డికి రామచంద్ర భారతి తెలప డం చర్చనీయాంశంగా మారింది. కాగా కర్ణాటక కు చెందిన బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన బిఎల్ సంతోష్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 15జులై నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. అంతకుముందు కర్ణాటక బిజెపిప్రధాన కార్యద ర్శిగా ఎనిమిది సంవత్సరాల ఈక్రమంలో ఆయనను దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా సంయుక్త ప్రధాన కార్యదర్శిగా అమిత్‌షా నియమించారు.

కర్ణాటకలోని చెందిన బిఎల్ సంతోష్ బిడిటి కాలేజ్‌లో ఇంజినీరింగ్ చేశారు. 1993లో సంతోష్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పూర్తిస్థాయిలో పనిచేశారు. మైసూరు, శివమొగ్గ, బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా విస్తృత ప్రచారం చేశారు. 2000లో సంతోష్ తిరిగివచ్చారు. అనంతరం బిజెపిలో చేరారు. కర్ణాటక బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. బిఎల్ సంతోష్ పదవీకాలంలోనే కర్ణాటకలో బిజెపి అధికారంలోకి వచ్చింది. 2014లో కమలం పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీ నియమితులయ్యారు. అనంతరం 2019లో సంతోష్ సెక్రటరీగా పదోన్నతి పొందారు.

ఆయన విరోధులు హెంతోష్‌కు కర్ణాటక బిజెపితోపాటు కేంద్రంలోని బిజెపి హైకమాండ్‌లోనూ పలుకుబడి, పట్టు ఉందని చెపుతుంటారు. ప్రజలకు పెద్దగా తెలియని ఇద్దరు అనామక వ్యక్తులు అశోక్ గస్తీ, ఎర్రన్న 2020లో రాజ్యసభ నియమించింది. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రికి ఇష్టంలేకపోయినా వీరిద్దరూ రాజ్యసభ ఎంపిలుగా నియమితులవడం వెనుక బిఎల్ సంతోష్ ఉన్నారని రాజకీయవర్గాల కథనం. కాగా బోవిలు, వడ్డర్లు తదితర దళితవర్గాలు వలస వచ్చారని స్థానికులు కాదని పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆయా వర్గాలు సంతోష్‌పై ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News