మనతెలంగాణ/ హైదరాబాద్ : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఎటిఆర్) ఫారెస్టులో బ్లాక్ బాజ పక్షి ప్రత్యక్షమైనట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ గోపిడి తెలిపారు. ఏప్రిల్ 9న నల్లమల అడవుల్లో బ్లాక్ బాజ కనిపించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మదన్‌రెడ్డి నల్లమల అడవుల్లో అరుదైన.. అందమైన బ్లాక్ బాజ పక్షిని తన కెమెరాలో బంధించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో బ్లాక్ బాజ పక్షి ఆనవాళ్లు లేవని తెలిపారు. ఈ పక్షి సాధారణంగా ఈశాన్య భారతదేశం, తూర్పు హిమాలయాలు, చైనా, ఆగ్నేయాసియా అడవుల్లో కనిపిస్తుందని రోహిత్ వెల్లడించారు. ఇవి గద్దలు, రాబందుల జాతికి సంబంధించిన పక్షులు అని పేర్కొన్నారు. బ్లాక్ బాజలు సాధారంగా దట్టమైన అడవుల్లో తరుచుగా కనిపిస్తాయి. వన్యప్రాణుల పెరుగుదలకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో విస్తృతమైన చర్యలు చేపడుతున్నామని అధికారి తెలిపారు.