కూనూర్: తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ17వి5 హెలికాప్టర్‌కు చెందిన బ్లాక్ బాక్స్(ఫ్లైట్ డేటా రికార్డర్)ను గురువారం ఉదయం కనుగొన్నారు. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటుగా మరో 11 మంది ఆర్మీ అధికారులు చనిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశానికి దగ్గర్లోనే బ్లాక్‌బాక్స్‌నుఆర్మీ రెస్కూ యూనిట్ కనుగొనింది. బ్లాక్ బాక్స్ కోసం హెలికాప్టర్ కూలిన చోటునుంచి 300 మీటర్లు మొదలుకొని కిలోమీటరు పరిధిలో ఆర్మీ రెస్కూ యూనిట్ విస్తృతంగా గాలింపు జరిపింది. బట్టలో చుట్టి ఉంచిన ఈ బ్లాక్‌బాక్స్‌ను వెల్లింగ్టన్‌లోని వైమానికస్థావరానికి ప్రత్యేక ఆర్మీ వాహనంలో తరలించారు. అక్కడనుంచి దీన్ని విశ్లేషణకోసం న్యూఢిల్లీకి , లేదా బెంగళూరుకుపంపిస్తారని తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రమాదానికి దారితీసిన కారణాలేమిటో తెలుసుకోవడంలో ఈ బ్లాక్‌బాక్స్ అత్యంత కీలకం కానుంది.
బ్లాక్‌బాక్స్ లభ్యం
- Advertisement -
- Advertisement -
- Advertisement -