Tuesday, January 21, 2025

భారత్ ఆస్ట్రోసాట్ సాక్షిగా కృష్ణబిలం 500వ పుట్టుక

- Advertisement -
- Advertisement -

black hole birth for 500th time

భారత అంతరిక్ష పరిశోధనలో ఇదో మైలురాయి

న్యూఢిల్లీ : భారత్ ఆస్ట్రోసాట్ అనే అంతరిక్ష టెలిస్కోప్ అంతరిక్షంలో కృష్ణబిలం 500 పుట్టుకలను రికార్డు చేయగలిగింది. కృష్ణబిలం అన్నది ఎంతో బలమైన గురుత్వాకర్షణ శక్తి కలిగినది దాని ఆకర్షణ నుండి ఏ కణమూ చివరకు కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ తప్పించుకోలేదు. ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ (ఇహెచ్‌టి)అనే రేడియో టెలిస్కోప్ మన పాలపుంత మధ్యలో కృష్ణబిలం మొట్టమొదటి దృశ్యాన్ని చిత్రీకరించ గలిగినా మన శాస్త్రవేత్తలు ఇందులో వెనుకబడ లేదు. కృష్ణబిలంలో నక్షత్రాలు తమంతట తామే విలీనం కావడం, అగాధం ంంటి లోతైన విచిత్రమైన దృశ్యం ఏర్పడడం ఇదంతా ఆస్ట్రోసాట్ చిత్రీకరించ గలిగింది. కృష్ణబిలాల్లో గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుందని ఎందుకంటే మొత్తం ద్రవ్యరాశి ఆ చిన్న ఖాళీ లోనే స్వాహా అవుతుందని, ఇది ఏదైనా నక్షత్రం అంతరించినప్పుడే జరుగుతుందని అమెరికా అంతరక్ష సంస్థ నాసా అభిప్రాయపడుతోంది.

స్పేస్ క్రాఫ్ట్ ఉపయోగించి ఈ కృష్ణబిలాల పుట్టుకలను పరిశోధించడంలో భారత్ ముందడుగు వేస్తోందని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయూసిఎఎ) వెల్లడించింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఆరున్నర సంవత్సరాల క్రితం ( 2015 నుంచి 2022 ) తన నేత్రం విప్పిన దగ్గర నుంచి గామా కిరణాల విస్ఫోటనాన్ని ( గామా రేస్ బర్‌స్ట్) అధ్యయనం చేస్తూనే ఉందని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ వరుణ్ భలేరావు వివరించారు. ఆస్ట్రోసాట్ పైన అమర్చిన కాడ్మియమ్ జింక్ టెల్యూరైడ్ ఇమేజర్ (సిజెడ్‌టిఐ) పరికరం ఐదు వందల సార్లు కృష్ణబిలాల పుట్టుకలకు సాక్షిగా నిలిచిందని ఐయూసిఎఎ అభివర్ణించింది. ఇది చెప్పుకోదగిన ఘన విజయమని పేర్కొంది.

గామా కిరణాల విస్ఫోటనం నుంచి సిజెడ్‌టిఐ సేకరించిన విలువైన డేటా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రభావం చూపిస్తుందని ఆశోకా యూనివర్శిటీ ప్రొఫెసర్ దీపాంకర్ భట్టాచార్య వివరించారు. సిజెడ్‌టిఐ ప్రస్తుత ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. నక్షత్రం విస్ఫోటనం చెందినప్పుడు వెలువడే గామా కిరణాల విస్ఫోటనాన్ని ఆస్ట్రోసాట్ అధ్యయనం చేస్తోంది. ఈ విస్ఫోటనాలన్నీ చాలా ”శక్తివంతమైనవి. వీటిని “మినీ బింగ్ బ్యాంగ్స్ ”అని పిలుస్తారు. ఇవి తీవ్రమైన జెట్స్ ( ఒక విధమైన దట్టమైన కాంతి), అత్యంత శక్తివంతమైన అణుధార్మికత ( రేడియేషన్)ను అంతరిక్షం లోకి పంపుతాయి. ఈ ఆస్ట్రోసాట్ ను 2015 సెప్టెంబర్ 28న 650 కిమీ దూరంలో ఉన్న కక్ష లోకి ప్రవేశ పెట్టారు. ఐదు సైంటిఫిక్ పరికరాలతో కూడిన ఈ ఆస్ట్రోసాట్ విశ్వం లోని అతినీల లోహిత కిరణాలను, దృశ్యాలను, ఎక్స్‌రే రేడియేషన్‌ను అధ్యయనం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News