Monday, December 23, 2024

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేతబడి చేయిస్తున్నారు: శివ కుమార్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేతబడి చేయిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి నాపై, సిఎం సిద్ధరామయ్యపై అఘోరాలు, తాంత్రికులతో పూజలు చేయిస్తున్నారు’ అని తెలిపారు. కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలో శత్రుభైరవి యాగంలో భాగంగా 21 ఎర్రమేకలు, మూడు గెదేలు, 21 నల్ల గొర్రెలు, ఐదు పందులను బలి ఇచ్చారని ఆరోపణలు చేశారు. రాజ కంటక, మారణ మోహనా, స్తంభన యాగాలు చేసేందుకు ప్రత్యేకంగా తాంత్రికులతో పూజలు చేయిస్తున్నారని డికె సంచలన ఆరోపణలు చేశారు.

వాళ్లు చేతబడులు చేసినా తాము నమ్మే శక్తే తమను రక్షిస్తుందన్నారు. నిమ్మకాయ నిపుణులకు భయపడమని, కర్నాటక ప్రజల ఆశీస్సులే తనని, సిఎం సిద్ధరామయ్యను కాపాడుతాయన్నారు. బిజెపి, జెడిఎస్ నాయకులు పూజలు చేయించారా? అని విలేకరులు శివ కుమార్‌ను ప్రశ్నించారు. కర్నాటకకు చెందిన రాజకీయ నాయకులు మంత్ర తంత్రాలు చేయించారని జవాబుదాటేశారు. జూన 2న బెంగళూరులో శాసన సభ్యుల సమావేశం ఉంటుందని ఆయన ప్రకటించారు. ఎంపి, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిలు అందరూ హాజరు కావాలని, పార్టీ వ్యవహారాలు, ఎంఎల్‌సి ఎన్నికల చర్చ జరుపుతామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News