న్యూయార్క్: అమెరికాలో మరో నల్ల జాతీయుడి చనిపోయిన వార్త బయటకు రావడంతో వివాదం రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు వెంటపడడంతో ఓ నల్ల జాతీయుడి తన కారు చెట్టును ఢీకొట్టాడు. అక్కడికక్కడే నల్ల జాతీయుడు చనిపోయాడని పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. 2019 మే 10న అమెరికాలోని లూసియానాలో జరిగింది. రోనాల్డ్ గ్రీన్ అనే నల్ల జాతీయుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడంతో అతడి కారు ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కారు ఆపకుండా ముందుకు వెళ్లడంతో పోలీసులు అతడి వెంటపడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా నడిపి చెట్టును ఢీకొట్టాడు. చెట్టును కారు ఢీకొట్టడంతో రోనాల్డ్ చనిపోయాడని పోలీసులు అతడి బంధువులకు తెలిపారు. పోలీసులు రోనాల్డ్‌ను అరెస్టు చేసినప్పుడు అతడు చాలా కష్టపడ్డాడని, కారు ప్రమాదంలో చనిపోలేదని గాయాలయ్యాయని, అతడిని పోలీసులు చంపేశారని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. సస్పెండ్ చేసిన పోలీసులు విధుల్లోకి చేరడంతో ఆ పోలీస్ అధికారులపై రోనాల్డ్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న పోలీసులలో ఒకరు కారు ప్రమాదంలో చనిపోయారని అధికారులు వెల్లడించారు. జార్జ్ ప్లాయిడ్ మరణంతో అమెరికా అట్టుడికిపోయిన విషయం తెలిసిందే.
మరో నల్లజాతీయుడి మరణంపై అమెరికాలో వివాదం
- Advertisement -
- Advertisement -
- Advertisement -