Wednesday, January 22, 2025

ఆటో @ రూ.5 లక్షలు

- Advertisement -
- Advertisement -

హదరాబాద్: సాధారణంగా వాహనాల ధరలు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఒకే ధర ఉంటాయి. ఒక వేళ తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కోనుగోలు చేస్తే ట్యాక్స్‌ల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొంత ఎక్కువ, తక్కువల ఉండే అవకాశం ఉంటుంది. కాని ఇందుకు భిన్నంగా గ్రేటర్‌హైదరాబాద్‌లో కొన్నివాహనానికి పోరుగు జిల్లాల్లో కొన్న వాహనానికి లక్షల్లో తేడా వస్తుండటంతో సదరు వాహనాన్ని కొనుగోలు చేయాలంటే వాహదారులు బెంబెలెతున్నారు.

నగరానికి పోరుగు జిల్లాల్లో ఒక ఆటో ఖరీదు సుమారు రూ. 2.50 లక్షలు ఉండగా అదే ఆటోను హైదరాబాద్‌లో కోనుగోలు చేయాలంటే రూ. 5. లక్షల 10 వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. అంటే ఒక ఆటో ఖరీదు కారు ఖరీదుతో సమానంగా మారింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఆటోలు బ్యాక్ మార్కెట్‌లో కోనుగోలు చేయాల్సి రావడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆటోయూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జోరుగా సాగుతున్న ఆటోల బ్లాక్ మార్కెట్
నగరంలో బ్లాక్ మార్కెట్‌లో కొత్త ఆటోల పర్మిట్ దందా జోరుగా సాగుతోంది. కాలుష్య నియంత్రణలో భాగంగా భాగంగా ఆటోలను ప్రభుత్వం నిషేదించి అతి తక్కువ సంఖ్యలో కొత్త వాటిని విక్రయించేలా చేస్తుంటే దీన్ని అవకాశంగా తీసుకుంటున్న ఆటో ఫైనాన్స్ కంపెనీల నిర్వహకులు షోరూంలతో కుమ్మక్కై ఆటోలను బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ప్రజల నుంచి భారీగా దండుకుంటున్నారు. ఒక్కో ఆటోపై మార్కెట్ ధర కంటే సుమారు రూ.60 నుంచి 80 వేలు వరకు వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో2002లో ఏర్పడ్డ బూరేలాల్ కమిటీ ఆటోల నిషేదించడంతో వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. డ్రైవింగ్ వృత్తిగా నమ్ముకుని నగరాకి వచ్చిన వారు ఆటోలను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొందరు అద్దెకు ఆటోలను తీసుకుని నడుపుకుంటూ ఉంటే … మరి కొందరు కొత్త ఆటోలను కొనుక్కుని జీవనం సాగిస్తున్నారు.

కొత్త ఆటోలను కొనుగోళ్ళకు ప్రభుత్వం నుంచి అనుమతి లేక పోవడంతో ఆటోలను కొనుగోలు చేయాలనుకునే వారి పర్మిట్ పేరుతో రూ. 2.50 లక్షలవరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఆటో పర్మిట్ ఉంటే కొత్త ఆటోలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన ఆటో స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా స్క్రాప్ చేసిన ఆటోలకు సంబంధించిన వివరాలతో కొత్త ఆటోలకు అనుమతి (పర్మిట్ ) పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా పర్మిట్ కోసమే పెద్ద మొత్తంలో సమర్పించాల్సి వస్తోంది. ఇక షోరూంల్లో ఆటో రిక్షా ధర రూ.2.50 వేలు ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఆటో రిక్షా కావాలని వస్తే పర్మిట్‌తో కలిపి ఒక ఆటోను రూ.5 లక్షలకు పైగానే అమ్ముతున్నారు. నగరంలో ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలకు ఇక్కడ ప్రవేశం లేదు. హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన వాటినే ఇక్కడ నడపాలి.దీంతో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన పాత ఆటో రిక్షాలు సైతం పెద్ద మొత్తంలో అమ్ముడు పోతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News