న్యూఢిల్లీ: వెల్లడించని విదేశాలలోని ఆస్తులు, పెట్టుబడులను గుర్తించినట్లు ఆరోపిస్తూ, 2015 బ్లాక్ మనీ యాక్ట్ (BMA) కింద రిలయన్స్ (ADA) గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను దర్యాప్తు విభాగానికి చెందిన ముంబై యూనిట్ మార్చి 2022లో తుది ఉత్తర్వులు జారీ చేసింది.
2019లో మొదటిసారిగా వెల్లడించని విదేశాలలోని ఆస్తుల విషయమై వెబ్‌పై పారిశ్రామికవేత్తకు(అనిల్ అంబానీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, బ్లాక్ మనీ యాక్ట్ ఆర్డర్ దాఖలు చేయబడింది.
ఆర్డర్‌లో విదేశాలలోని సంస్థలు, లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలలోని లావాదేవీల వివరాలు రూ. 800 కోట్లకు పైగా ఉన్నట్లు చూపారు. ప్రస్తుత రూపాయి-డాలర్ మారకం విలువ ఆధారంగా ఈ సంఖ్యను లెక్కించినట్లు అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. బహామస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో ఆయనకు ఆస్తులు ఉన్నాయని వెల్లడి. నార్త్ అట్లాంటిక్ ట్రేడింగ్ అనే విదేశాలలో మరో కంపెనీ కూడా అనిల్ కు ఉందని వెల్లడి. జూరిచ్ లోని యూబిఎస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సైరస్ లో కూడా అతడికి లెక్కకు రాని ఖాతాలున్నట్లు వెల్లడయింది. అనిల్ అంబానీకి చెందిన వెల్లడించని విదేశాలలోని ఆస్తుల గురించి ‘పండోరా పేపర్స్’ పరిశోధన చేసి మరీ ప్రచురించింది.