- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 10 నల్ల పులులు ఉన్నాయని, అవన్నీ ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లోనే కనిపించాయని ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌కు తెలియచేసింది. అత్యంత అరుదైన నల్ల పులులు ఒడిశాలోని సిమిలిపాల్ పులుల అభయారణ్యంలో మాత్రమే ఉన్నట్లు కేంద్ర పర్యావరణశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభలో తెలిపారు.
భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పులుల సంఖ్య లెక్కింపు కార్యక్రమం ప్రకారం 2022లో సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో మొత్తం 16 పులులు ఉండగా వీటిలో 10 నల్ల పులులని ఆయన చెప్పారు. వన్యప్రాణి కేంద్రాల సమగ్ర అభివృద్ధి పథకం కింద సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌కు గత కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ. 32.75 కోట్ల ఆర్థిక సహకారాన్ని అందచేసిందని ఆయన తెలిపారు.
- Advertisement -