Friday, December 20, 2024

హైదరాబాద్‌లో బ్లాక్‌బెర్రీ ఐఒటి సెంటర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ కెనడా తర్వాత రెండో అంతర్జాతీయ ఐఒటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనుంది. నూతన ‘ఐఒటి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఇంజినీరింగ్, ఇన్నోవేషన్’ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు బుధవారం కంపెనీ ప్రకటించింది. ఈ ప్రపంచశ్రేణి ఇంజినీరింగ్ కేంద్రం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను నియమించుకోవడం ద్వారా సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్(ఎస్‌డివిలు) నిర్మించడంలో సహాయపడనుంది. దీంతో పాటు ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిశ్రమలలో అత్యాధునిక ఆవిష్కరణలను సేఫ్టీ సర్టిఫైడ్ బ్లాక్‌బెర్రీ క్యుఎన్‌ఎక్స్) ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో, బ్లాక్‌బెర్రీ ఐవివై సహాయంతో చేయనుంది. కెనడా తర్వాత అంతర్జాతీయ ఐఒటి డివిజన్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, కంపెనీకి హైదరాబాద్ రెండో అంతర్జాతీయ సెంటర్ కానుందని బ్లాక్‌బెర్రీ పేర్కొంది. ఇక్కడ 100 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు విస్తృతశ్రేణి సాంకేతిక స్థాయిలు, నైపుణ్యాలతో పనిచేయనున్నారు.

వీరిలో సీనియర్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ప్రాజెక్ట్‌మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంటిగ్రేషన్, సర్వీస్ డెలివరీ వంటివి ఉంటాయి. బ్లాక్‌బెర్రీ ఐఒటి ప్రెసిడెంట్ మత్తియాస్ ఎరిక్‌సన్ మాట్లాడుతూ, నైపుణ్యాలు, ఆవిష్కరణలలో కొనసాగుతున్న బ్లాక్‌బెర్రీ ప్రస్తుత పెట్టుబడులలో మరో మైలురాయిని చేరుకుందని, బ్లాక్‌బెర్రీ ఐఒటి అంతర్జాతీయ ఆవిష్కరణ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌లో విస్తరించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు. దీనిలో క్యుఎన్‌ఎక్స్ యాక్సలరేట్ కార్యక్రమం కూడా భాగంగా ఉంటుంది. ఇది క్యుఎన్‌ఎక్స్‌ను క్లౌడ్‌లో అందించడంతో పాటుగా ఉత్పత్తి అభివృద్ధి వేగవంతం చేసి, ఆటోమోటివ్, వైద్య పరికరాలు, ఇండస్ట్రీయల్ కంట్రోల్స్, రోబొటిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, హెవీ మెషీనరీ సహా అత్యంత కీలకమైన పరిశ్రమల కోసం మార్కెటింగ్ సమయం కూడా తగ్గిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News