గే యాప్‌ను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మేయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న యువకుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని డబీర్‌పురాకు చెందిన పర్హాన్బోగ్(25) జల్సాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు గే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. యాప్‌లో ఉన్న వారితో పరిచయం పెంచుకుంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత తన ఇంటికి వారిని ఆహ్వానిస్తున్నాడు. ఇలా వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నట్లు నటించి ఆ సమయంలో వీడియో రికార్డు చేస్తున్నాడు. తర్వాత వీడియోలను బాధితులకు చూపించి డబ్బులు ఇవ్వాలని లేకుండా సోషల్ మీడియాలో పెడుతానని బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ క్రమంలోనే షేక్‌పేట, జైహింద్ నగర్‌కు చెందిన ఓ యువకుడు(22) నిందితుడికి యాప్‌లో పరిచయం అయ్యాడు.
అతడిని తన ఇంటికి రప్పించుకున్న నిందితుడు అతడితో సన్నిహితంగా ఉన్నసమయంలో వీడియో రికార్డు చేసి బ్లాక్‌మేయిల్ చేశాడు. తనకు వెంటనే రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు, లేకుంటే సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేస్తానని బెదిరించాడు. బాధితుడు చేసేదిలేక నిందితుడికి రూ.10,000 ఫోన్‌పే ద్వారా పంపించాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు నిందితుడిపై ఈ నెల 1వ తేదీన ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడి ఫోన్ పే ఆధారంగా కాల్ డేటా సేకరించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పర్హాన్బోగ్ ’గే’ కాదని, కేవలం ’గే’లను పరిచయం చేసుకుని బ్లాక్ మెయిల్ చేసేందుకు జెండర్ యాప్‌లో ఉన్నాడని, గతంలో కూడా ఇలాగే బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.