Saturday, November 23, 2024

టాటా పవర్‌లో బ్లాక్‌రాక్ రూ.4 వేల కోట్ల పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

Tata Motors Increase in commercial vehicle prices

న్యూఢిల్లీ : టాటా పవర్‌కు చెందిన వెన్యూవబుల్ ఎనర్జీ యూనిట్‌లో 10.53 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ముబదాల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీతో సహా బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్ కన్సార్టియం రూ.4000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈమేరకు టాటా పవర్ గురువారం ప్రకటన చేసింది. ఇది టాటా పవర్ రెన్యూవబుల్‌ను రూ.34 వేల కోట్ల ఈక్విటీ వాల్యుయేషన్‌ను అనువదిస్తుందని స్టాక్ ఎక్సేంజ్‌లో కంపెనీ వెల్లడించింది. మొదటి దశ ఇన్వెస్ట్‌మెంట్ జూన్ నాటికి, మిగతా 2022 ఆఖరి నాటికి పూర్తి కానుంది.

టాటా న్యూలో 22 లక్షల యూజర్లు

టాటా గ్రూప్ నుంచి సూపర్ యాప్ టాటా న్యూను లాంచ్ చేసిన వారం రోజుల్లోనే 22 లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పటివరకు గణనీయమైన లావాదేవీలు జరిగాయని టాటా డిజిటల్ ప్రకటించింది. ఉప్పు నుంచి స్టీల్ వరకు బహుళ వ్యాపారాలు కల్గిన టాటా గ్రూప్ కొత్త సూపర్ యాప్ ‘టాటా న్యూ’ను ఈనెల 7న ఆవిష్కరించింది. కిరాణా వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఫ్లైట్ బుకింగ్స్, ఫుడ్ డెలివరీ, ఇన్వెస్ట్‌మెంట్, హోటల్ బుకింగ్స్ వంటి అనేక సేవలను ఈ ఒక్క యాప్‌తోనే పొందవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. టాటా గ్రూప్ ప్రధాన లక్ష్యం కంపెనీ మొత్తం డిజిటల్ వింగ్‌ను పెంచడం, తద్వారా ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ వంటి కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వడమే. టాటా కొత్త యాప్ ద్వారా విమాన టికెట్లు, హోటళ్లు, మందులు, కిరాణా సామాగ్రిని ఒకే ప్లాట్‌ఫామ్‌పై పొందేందుకు వీలుకల్గుతుంది. టాటా న్యూ యాప్ ఇంటర్‌ఫేస్ ఫోటోలో డార్క్ థీమ్‌తో పాటు అనేక విభిన్న చిహ్నాలు కనిపిస్తాయి. ఈ యాప్ నుండి కారును కూడా బుక్ చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News