Tuesday, April 1, 2025

ఆర్‌టిసి కంట్రోలర్‌పై బ్లేడ్ బ్యాచ్ దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్‌టిసి కంట్రోలర్ కొప్పుల గాంధీపై బ్లేడ్ దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఆర్‌టిసి కంట్రోలర్ కొప్పుల గాంధీకి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. బ్లేడ్ బ్యాచ్ దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పారిపోతున్న బ్లేడ్ గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. బ్లేడ్ బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో విజయవాడ నగరంలోని చిట్టి నగర్ సొరంగం రోడ్డులో ఓ బార్‌లో అద్దాలు పగలగొట్టి నానా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News