Friday, April 4, 2025

ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో పేలుడుకు ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

నాగపూర్ సమీపాన పేలుడు పదార్ధాలు తయారు చేసే ఫ్యాక్టరీలో గురువారం సంభవించిన పేలుడుకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. నాగపూర్‌కు దాదాపు 25 కిమీ దూరంలో ఉన్న ధమన గ్రామంలో చాముండీ ఎక్స్‌ప్లోజివ్ ప్రైవేట్ ఫ్యాక్టరీలో మధ్యాహ్నం 1 గంట సమయంలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది గాయపడగా, వారిని నాగపూర్‌లోని రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించడమైందని, చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని నాగపూర్ పోలీస్ కమిషనర్ రవీంద్ర సింఘాల్ వెల్లడించారు. పేలుడు జరిగిన సమయంలో చాలా మంది బాధితులు ప్యాకేజింగ్ యూనిట్‌లో పనిచేస్తున్నారని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News