Sunday, December 22, 2024

నాగ్ పూర్ ఫ్యాక్టరీలో పేలుడు

- Advertisement -
- Advertisement -

ఐదుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు

నాగ్ పూర్: హింగ్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమ్న గ్రామంలో ఉన్న చాముండి ఎక్స్ ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని నాగ్ పూర్  సిటీ పోలీస్ కమిషనర్ రవీందర్ సింఘాల్ తెలిపారు.

చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనస్థలిలో క్రైమ్ బ్రాంచ్, సీనియర్ పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్యాక్టరీలో పేలుడు మధ్యాహ్నం 1 గంటకు జరిగింది. ఆ సమయంలో కార్మికులు ప్యాకింగ్ చేస్తున్నారని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. కార్మికుల మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News