Thursday, April 3, 2025

బాణసంచా గోడౌన్‌లో పేలుడు..18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో మంగళవారం బాణసంచా గిడ్డంగిలో జరిగిన పేలుడు కారణంగా భవనం కూలిపోయి మంటలు చెలరేగడంతో 18 మంది మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఉదయం 9.45 గంటలకు దీసా పట్టణం సమీపంలోని పారిశ్రామిక వాడలో జరిగింది. పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో భవనం శ్లాబ్ కూలిపోవడంతో 18 మంది చనిపోగా, ఐదుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రామికులు. అది టపాసుల గిడ్డంగే తప్ప తయారుచేసే పరిశ్రమ కాదని పోలీసులు తెలిపారు. కాగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇదిలావుండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కార్మికుల అకాల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు.గుజరాత్ అధికారులతో నిరంతర సంప్రదింపులో ఉన్నామన్నారు. బాధితులకు అన్ని విధాల సాయపడుతామని కూడా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News