Monday, January 20, 2025

గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు

- Advertisement -
- Advertisement -

గన్స్‌కు వాడే పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు. పొట్టకూటికోసం పనిచేసే కార్మికులకు సజీవసమాధి అయింది. ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం పొద్దునే భీకరమైన పేలుడు జరిగింది. ఈ ఘటనలో కనీసం పది మంది వరకూ కార్మికులు కుప్పకూలిన భవనం శిధిలాల కింద నలిగి చనిపోయినట్లు, ఎంతో మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. చాలా సేపటి వరకూ అధికారులు, ఫ్యాక్టరీ వర్గాలు మృతుల విషయాన్ని నిర్థారించలేదు. కేవలం పేలుడు జరిగిందనే ప్రకటనలు వెలువరించారు. అయితే అత్యంత పేలుడు, జ్వలిత స్వభావపు గన్‌పౌడర్ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు దారుణ పరిస్థితి సృష్టించిందని , కనీసం పది మంది వరకూ చనిపోయి ఉంటారని, కార్మికుల విధుల డ్యూటీ పట్టిక వంటివి ఉంటే అసలు విషయాలు తెలుస్తాయని స్థానికులు తెలిపారు. భారీ చప్పుళ్లతో ఫ్యాక్టరీలో పేలుడుతో సమీప ప్రాంతం అంతా దద్దరిల్లింది. వెంటనే అక్కడికి పోలీసు, అగ్నిమాపక దళాలు, అంబులెన్స్ వ్యాన్లు తరలివెళ్లాయి.

దట్టమైన పొగ కమ్ముకోవడం, భారీ స్థాయిలో భవన శిథిలాలు కింపడటం , పక్కనే గన్‌పౌడర్ నిల్వలు ఉండటంతో హుటాహుటిన సహాయక పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. బెమెతారా జిల్లాలోని బెర్లా బ్లాక్‌లో ఉన్న బోర్సి గ్రామంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. గన్స్‌లో వాడే మిశ్రమాన్ని పలు భాస్వర, ఇతరత్రా రసాయనిక పదార్థాల నుంచి సేకరించి ధట్టించి గన్‌పౌడర్‌ను తయారు చేసేందుకు కార్మికులను కుదుర్చుకుంటారు. ఈ పేలుడు ఘటనలో 17 మందికి పైగా చనిపోయి ఉంటారని స్థానిక వార్తాసంస్థలు, వాట్సాప్ వార్తలు ద్వారా వెల్లడైంది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని శిథిలాలను తొలిగించేందుకు రంగంలోకి దిగారు. లేకపోతే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేదని వెల్లడైంది. గాయపడ్డ వారిని రాయ్‌పూర్‌లోని మెహెకర ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి జిల్లా కలెక్టర్ , ఆ తరువాత ఎస్‌పి ఇతర ఉన్నతాధికారులు తరలివచ్చారు. ప్రమాదం జరిగింది, పేలుడు చోటుచేసుకుంది కానీ ఎవరూ చనిపోలేదని, గాయపడ్డ వారినిఆసుపత్రులకు తరలించారని బెమెతారా జిల్లా ఎస్‌పి రామకృష్ణ సాహూ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News