Tuesday, January 14, 2025

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు రష్యా దౌత్య సిబ్బంది సహా 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

Blast at Russian Embassy in Kabul

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఘటనలో ఇద్దరు రష్యా దౌత్య సిబ్బంది సహా 20 మంది చనిపోయారు. “దౌత్య కార్యాలయం ఆఫ్ఘన్ భద్రతా సేవలతో సన్నిహితంగా ఉంది, వారు దర్యాప్తు చేస్తున్నారు.” రష్యా బాధితుల గుర్తింపు ఇంకా స్పష్టంగా లేదు.

కాబూల్‌లో ఇటీవల పేలుళ్ల ఘటనలు మళ్లీ పెరిగాయి. అమాయక ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కాబూల్‌లోని ఓ మసీదులో ఈ నెల రెండున జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో 20 మంది మరణించారు. మృతుల్లో ప్రముఖ మత నాయకుడు ముజీబ్‌ ఉల్‌ రహమాన్‌ అన్సారీ కూడా ఉన్నారు. సుమారు 200 మంది గాయపడ్డారు. హెరాత్‌ నగరంలోని గుజర్గా మసీదులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో మసీదు కిక్కిరిసిన సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News