Saturday, December 21, 2024

సోలార్ కంపెనీలో భారీ పేలుడు… 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై : నాగ్‌పూర్ లోని బజార్‌గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉదయం షిప్టులో చేరిన కార్మికులు కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో రసాయన ద్రావణంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు చెల్లాచెదురయ్యారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోగా, మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు నాగ్‌పూర్ పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News