ఢిల్లీలో రోహిణిలోని సెక్టార్ 14 ప్రాంతంలోని CRPF పాఠశాల సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే క్రైమ్ టీమ్, ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. పాఠశాల గోడ దెబ్బతిన్నట్లు గుర్తించారు. పేలుడుతో స్కూల్ సమీప దుకాణం, అక్కడ పార్క్ చేసిన కారు అద్దాలు కూడా దెబ్బతిన్నాయని.. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
సీనియర్ అధికారి మాట్లాడుతూ.. క్రైమ్ టీమ్, ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. “పేలుడు ప్రదేశం నుండి నమూనాలను సేకరించడానికి మా ఫోరెన్సిక్ బృందం, క్రైమ్ యూనిట్ సంఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్నారు.ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం” అని చెప్పారు.