Saturday, December 28, 2024

కాబూల్ పాఠశాలలో పేలుళ్లు…అనేక మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

Kabul blasts

కాబూల్: ఇక్కడికి సమీపంలోని షియాతె హజారాలోని బాలుర పాఠశాలలో రెండు బాంబులు పేలడంతో అనేక మంది చనిపోయారు. కాగా నలుగురు చనిపోయినట్లు, 14 మంది గాయపడ్డారని ఆసుపత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది.  కాబుల్ పోలీస్ ప్రతినిధి ఖాలీద్ జద్రాన్ ఏఎఫ్‌పి వార్తా సంస్థతో ‘కాబూల్ పశ్చిమాన ఉన్న దష్త్‌ఎబార్చీలోని అబ్దుల్ రహీమ్ షాహీద్ హైస్కూల్ బయట రెండు బాంబులు పేలాయి’ అని తెలిపారు. ఆ ప్రాంతంలో హజరా వర్గం నివసిస్తుంటుంది. ఇదివరలో ఐఎస్ జిహాదీలు కూడా వారిపై దాడి చేశారు. మంగళవారం విద్యార్థులు ఉదయపు క్లాసుల నుంచి బయటికి వస్తున్నప్పుడు ఈ పేలుళ్లు జరిగాయని ఓ ప్రత్యక్షసాక్షి ఏఎఫ్‌పి వార్తా సంస్థకు తెలిపాడు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. కానీ తాలిబాన్ యోధులు విలేకరులను ఆ ప్రాంగణంలోకి రానివ్వలేదు. ఈ పేలుళ్లు చేపట్టింది తామేనని ఏ వర్గం ప్రకటించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News