కంటిలో నుంచి రక్తస్రావం వైరస్‌గా పేర్కొంటుండే ప్రాణాంతక వైరస్ ‘మార్బర్గ్ వైరస్ డిసీజ్’ (ఎంవిడి) ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను కలవరపరుస్తోంది. ర్యాండాలో ఇటీవల వెలుగు చూసిన ఈ వైరస్ 66 మందికి సోకగా, నవంబర్ 29 నాటికి 15 ప్రాణాలను బలిగొన్నది. ర్వాండాకు ప్రయాణించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హు) అక్టోబర్‌లో హెచ్చరించడాన్ని బట్టి ఈ వ్యాధి ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు. బాధితులు రక్త నాళాలపై ఈ వైరస్ దాడి చేస్తుంది కనుక దీనికి కంటిలో నుంచి రక్తస్రావం వైరస్ అనే పేరు వచ్చింది.
ముక్కు, చిగుళ్లు, నోరు, యోని, చెవులు లేదా కళ్లు వివిధ ప్రదేశాల నుంచి రక్తస్రావం అయ్యేలా ఇది చేస్తుంది. పండు గబ్బిలాల ద్వారా మానవులకు ఎంవిడి వ్యాపిస్తుంది. ఆ తరువాత బాధిత వ్యక్తుల శారీరక ద్రవాలు తాకడం ద్వారా వ్యాపిస్తుంది. 21 రోజుల వరకు ఎటువంటి లక్షణాలూ చూపకుండానే ఒక వ్యక్తికి సోకే సామర్థం ఈ వైరస్‌ను మరింత విషమం చేస్తోంది. అయితే, లక్షణాలు ఐదు నుంచి తొమ్మిదిరోజుల్లోపే సాధారణంగా కనిపిస్తుంటాయి. ఆ తరువాత ఇది రక్త నాళాలను దెబ్బ తీయనారంభిస్తుంది. బాధితుడు తరచు అవయవ వైఫల్యం కారణంగా మరణిస్తాడు.