Wednesday, January 8, 2025

రువాండాలో ‘బ్లీడింగ్ ఐ వైరస్’ కు 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

‘బ్లీడింగ్ ఐ డిసీజ్’ లేదా ‘బ్లీడింగ్ ఐ వైరస్’ అని పిలువబడే ‘మార్బర్గ్ వైరస్ డిసీజ్’ (ఎంవిడి) అనే ప్రాణాంతక వైరస్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులకు ఆందోళన కలిగిస్తోంది.

రువాండాలో ఇటీవల వ్యాప్తి చెందిన ఈ వైరస్ 66 మందికి సోకింది, నవంబర్ 29 నాటికి 15 మంది దీని ద్వారా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రువాండాకు ప్రయాణించొద్దని చేసిన హెచ్చరిక ద్వారా వ్యాధి యొక్క తీవ్రత ఎంతటిదో నిర్ధారించవచ్చు.

‘బ్లీడింగ్ ఐ వైరస్’ బాధితుల రక్తనాళాలపై దాడి చేసి  ముక్కు, చిగుళ్లు, యోని, నోరు, చెవులు లేదా కళ్లతో సహా వివిధ రంధ్రాల నుంచి రక్తస్రావం అయ్యేలా చేయడం వల్ల ఈ వైరస్‌కు ఈ పేరు వచ్చింది. ఎంవిడి, ఎబోలా ఫిలోవైరస్ అని పిలువబడే సూక్ష్మజీవులు ఒకే కుటుంబానికి చెందినవి.

వ్యాధి సోకిన వ్యక్తుల్లో 21 రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే వ్యాధి లక్షణాలు సాధారణంగా ఐదు నుంచి తొమ్మిది రోజుల్లో కనిపిస్తాయి. రక్తనాళాలను దెబ్బతీస్తాయి. అంగాలు దెబ్బ తినడం వల్ల వ్యక్తి మరణిస్తాడు. ఈ వ్యాధి పండ్ల గబ్బిలాల(ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి హై ఫీవర్, వివిధ అంగాల నుంచి రక్తస్రావం కావడమే కాక అయోమయానికి గురికావడం, రెచ్చిపోయి దాడిచేయడం వంటివి చేస్తుంటాడు. సాధారణంగా ఎంవిడి పండ్ల గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంటుంది. ఎంవిడి సోకిన వ్యక్తుల్లో 88 శాతం మంది చనిపోతారు. అయితే ఇప్పుడు రువాండలో మరణాల రేటు 23 శాతం మాత్రమే ఉంది. దేశంలో ఈ వైరస్ ను అంత మొందించినట్లు రువాండ అధికారులు నవంబర్ నెల మధ్యన ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News