సూర్యాపేట:పాలనలో మేటిగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బ్రాహ్మణోత్తముల ఆశీర్వాదాలు ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధికారంలోకి వచ్చాకే అన్నంపెట్టె రైతులకు, ఆశీర్వదించే అర్చకులకు ఆదరణ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా దీప దూప నైవేద్యం అర్చక సమాఖ్య ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డికి బ్రాహ్మణోత్తములు వేద మంత్రాల మధ్యన శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి సభలో ప్రసంగిస్తూ అటు రైతాంగానికి ఇటు అర్చకులకు గతంలో ప్రస్తుతం ఉన్న ఆదరణలో మార్పులను గమనించాలని కోరారు. 2014కు పూర్వం 70 సంవత్సరాలుగా అన్నంపెట్టే రైతు తాను రైతు అని చెప్పుకోవడానికి, అర్చకత్వం చేస్తున్న అని చెప్పుకోవడానికి అర్చకుడు బిడియ పడే రో జుల నుండి తలెత్తుకుని తాము రైతులమని, అర్చకత్వం చేస్తున్న అర్చకులు తాము అర్చకులమని తలెత్తుకుని చెప్పుకునే స్థాయికి తెల ంగాణ సమాజం చేరుకుందన్నారు.
అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ రూపొందించిన ప్రణాళికలే కారణమన్నారు. ఇటువంటి మార్పులను పండితోత్తములైన అర్చకులు జనభాహుళ్యంలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. జరుగుతున్న అభివృద్ధికి మీరే సాక్షులని, అ ందులో కర్త, కర్మ, క్రియ పాత్రలు పోషిస్తున్న ఘనాపాటీలు మీరు అని, అటువంటి మీ ఆశీర్వాదాలు నిండు మనసుతో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రంగరించి పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోనే 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం గా తెలంగాణ రికార్డులకెక్కిందన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళానికి అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ అధ్యక్ష త వహించగా పోతుల పాటి రామలింగేశ్వర శర్మ, శ్రీరంగం గోపికృష్ణమాచార్యులు, హరికిషన్ శర్మ, లక్ష్మీనరసయ్య, అన్నంబొట్ల ఫణికుమార్ శర్మ, ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.