Wednesday, January 22, 2025

దేశానికి నిత్యం కాళీమాత ఆశీస్సులు : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

blessings of Maa Kali are always with India

న్యూఢిల్లీ : కాళీమాత అపరిమితమైన ఆశీస్సులు దేశానికి ఎప్పుడూ ఉంటాయని, ఇదే ఆథ్యాత్మిక శక్తితో అనాదిగా సాధు సన్యాసులు లోకకళ్యాణం కోసం పనిచేస్తూ వచ్చారని ఏక్‌భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే పవిత్ర సంప్రదాయాన్ని పాటించారని ప్రధాని నరేంద్రమోడీ తన ఆధ్యాత్మిక గురువు స్వామి ఆత్మస్థానంద శతజయంతి సందర్భంగా పేర్కొన్నారు. ఇదే ఆశయంతో రామకృష్ణమిషన్ పనిచేస్తోందని మోడీ వివరించారు. రామకృష్ణపరమహంస, స్వామీ వివేకానంద, స్వామి ఆత్మస్థానంద కాళీమాతను ఆరాధించేవారని, శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి విజ్ఞానంద …స్వామి ఆత్మస్థానందకు మంత్ర దీక్ష ఇచ్చారని ప్రధాని తెలిపారు.

స్వామి ఆత్మస్థానంద చివరి క్షణాల్లో కూడా తాను ఆయన వద్దే ఉన్నానని మోడీ గుర్తు చేసుకున్నారు. కాళీమాత పోస్టర్‌పై టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోడీ కాళీమాతపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ తన ప్రసంగంలో ఎక్కడా ఈ ప్రస్తావన తీసుకురాలేదు. ప్రతివిషయం కాళీమాత స్పహతోనే వ్యాపించి ఉంటుందని, ఈ స్పృహ బెంగాల్ లోని కాళీపూజలో కనిపిస్తుందని వివరించారు. భారత్ గొప్పగా తయారు కావడం కోసం స్వామీ వివేకానంద రామకృష్ణ మిషన్‌ను నెలకొల్పారని పేర్కొన్నారు. వివేకానందుని ప్రభావం దేశం నలుమూలలా కనిపిస్తుందన్నారు. రామకృష్ణమిషన్ బేలూర్ మఠం వారి సేవలు, సహాయ కార్యక్రమాలు భారత్ లోనే కాకుండా నేపాల్ , బంగ్లాదేశ్‌ల్లో కూడా విస్తరించాయని ప్రశంసించారు.

సహజ సేద్యం అంటే మాతృభూమిని సేవించడమే
సూరత్ : సహజ సేద్యాన్ని అనుసరించడానికి చేపట్టే ప్రజా ఉద్యమం రానున్న సంవత్సరాల్లో విజయవంతమౌతుందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం పేర్కొన్నారు. రైతులు త్వరగా ఈ మార్పును గ్రహిస్తారని, దీనివల్ల ఎక్కువ సత్ఫలితాలు పొందుతారని సూచించారు. సహజ సేద్యాన్ని చేపట్టడమంటే మాతృభూమిని సేవించినట్టే అని చెప్పారు. డిజిటల్ ఇండియా మిషన్ అసాధారణ విజయంపై మాట్లాడుతూ ఈమేరకు గ్రామాల్లో మార్పు సాధ్యం కాదన్న వారికి దేశం ఇచ్చే సమాధానం ఇదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News