Saturday, December 21, 2024

బేగంపేటలో విషాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకుంది. అంధ విద్యార్థుల స్కూల్లో అనుకోని విషాదం జరిగింది. బిల్డింగ్ పైనుంచి పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేర్ టేకర్ బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో విద్యార్థి లక్ష్మి గౌతమ్ శ్రీకర్ బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. 12 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థి లక్ష్మి గౌతమ్ శ్రీకర్ ఆరో అంతస్తు నుంచి కిందకి పడిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థి లక్ష్మీగౌతమ్ శ్రీకర్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. దేవనార్ అంధ పాఠశాలలోని తోటి విద్యార్థులు తన స్నేహితుడు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థి అకాల మరణం పట్ల అంధ పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అంధ పాఠశాలలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది ఇంకా స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News