Tuesday, March 4, 2025

జ్యుడీషియల్ సర్వీస్‌కు అంధత్వం అడ్డు కాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దృష్టి లోపం ఉన్న అభ్యర్థులకు జ్యుడీషియల్ సర్వీస్‌ల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం సంచలనాత్మకమై న తీర్పు వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో అలాంటి అభ్యర్థులకు జ్యుడీషియల్ సర్వీస్‌లో ఉద్యోగాలు కల్పించడం లేదని పేర్కొంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై జస్టిస్ జెబి పార్ధివాలా, జస్టిస్ ఆర్. మ హదేవన్‌తో కూడిన ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 3న తీర్పు రిజర్వు చేసింది. సోమవారం ఈ తీర్పును బయటపెట్టింది. దీనిపై జస్టిస్ మహదేవన్ మాట్లాడుతూ అలాంటి దృష్టి లోపం ఉన్న అభ్యర్థులపై జ్యుడిషియల్ సర్వీస్‌లో ఉద్యోగాలు కల్పించే విషయంలో ఎలాంటి వివక్ష చూపించరాదని స్పష్టం చేశారు. వారిని ఆయా జ్యుడిషియ ల్ సర్వీసులో

కలుపుకోవడానికి తగినట్టుగా ఆ యా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని సూ చించారు. దివ్యాంగులు ఎవరైనా సరే అభ్యర్థులు గా ఉన్నప్పుడు వారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని చెప్పారు. దృష్టి లోపం లేదా మాంద్యం ఉన్న వారిని జ్యుడీషియల్ సర్వీస్‌లో తీసుకోవడానికి వీలులేదని మధ్యప్రదేశ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (రిక్రూట్ మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ) రూల్స్ 1994ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పు వల్ల దివ్యాంగులు ఎవరైనా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పాల్గొంటే జ్యుడీషియల్ సర్వీస్ లోకి అనుమతించడానికి వీలవుతుంది. వారు ఇతరత్రా అర్హులైతే వారిని ఉద్యోగాల ఖాళీల్లో నియమించవచ్చని తీర్పులో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News