Saturday, January 11, 2025

కెటిఆర్, అర్వింద్ ఒత్తిడితోనే ఎఫ్‌ఇఒ సంస్థకు రూ.55కోట్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

ఎసిబి విచారణలో హెచ్‌ఎండిఎ మాజీ చీఫ్
ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డి వాంగ్మూలం
ఈకార్ రేసులో మాజీ అధికారిని
విచారించిన అవినీతి నిరోధక శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్‌ఎండిఎ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డి ని శుక్రవారం ఎసిబి విచారించింది. దాదాపు 6 గంటల పాటు జరిపిన విచారణలో పలు కీలక విషయాలను ఎ సిబి రాబట్టినట్టు తెలుస్తోంది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ రి కార్డులను పరిశీలించిన ఎసిబి అధికారులు వాటిని బి ఎల్‌ఎన్‌రెడ్డి ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించారు. హెచ్‌ఎండిఎ నుంచి బదిలీ అయిన రూ.47.75 కోట్లపై ఎసిబి ఆరా తీసింది. పెనాల్టీ కింద చెల్లించిన రూ.8కోట్ల పైనా ఎసిబి వివరణ అడిగినట్లు సమాచారం. మాజీ మంత్రి కెటిఆర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా ఎసిబి ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. ఇందులో తన సొంత ప్రయోజనాలు ఏమీ లేవని ఎసిబి అధికారులకు బిఎల్‌ఎన్ రెడ్డి వివరించినట్లు సమాచారం.

వారిద్దరి ఒత్తిడి వల్లనే ఈకార్ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఇఒకు రూ.55 కోట్లకు సంబంధించి తాను ప్రొసీడింగ్స్ చేసిన ట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. నగదు బదిలీ చే స్తే భవిష్యత్తులో ఇరుక్కుపోతామని తనకు ముందే తె లుసని ఎసిబి అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అ యినా అప్పటి పరిస్థితుల వల్లే నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళ్లాల్సి వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. తాను ఎసిబి విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉ న్నానని, ఇడి అడిగిన ప్రశ్నలనే మీరూ అడుగుతున్నారని ఎసిబి అధికారులకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇడి అడిగిన ప్రశ్నలన్నిటికీ తాను సమాధానం ఇచ్చానని ఎసిబి విచారణలో బిఎల్‌ఎన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ఎసిబి అధికారులు బిఎల్‌ఎన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News