- Advertisement -
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎసిబి కార్యాలయంలో విచారణకు బిఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ సమయంలో హెచ్‌ఎండిఎ చీఫ్ ఇంజినీర్‌గా బిఎల్‌ఎన్ రెడ్డి ఉన్నారు. హెచ్‌ఎండిఎ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నగదు బదిలీ వ్యవహారంపై ఎసిబి ఆరా తీస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఎల్‌ఎన్ రెడ్డి ఎ3గా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో అర్వింద్ కుమార్‌ను ఎసిబి అధికారులు విచారించారు. ఫార్ములా ఈ కార్ రేసులో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి మళ్లింపుపై కెటిఆర్‌ను ఎసిబి అధికారులు గురువారం ప్రశ్నించిన విషయం తెలిసిందే.
- Advertisement -