ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనున్నాయి. దీనికి ముందే ఢిల్లీలోని బ్లాక్ స్థాయి కాంగ్రెస్, బిజెపి నాయకులనేకమంది ముఖ్యమంత్రి ఆతిషి సమక్షంలో శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఈ కొత్త సభ్యులను ఆహ్వానించిన ఆతిషి ‘అరవింద్ కేజ్రీవాల్, ఆప్ చేసిన పనులకు ప్రేరణ పొంది, పార్టీ కాన్వాయ్ రోజురోజుకు బలోపేతం అవుతోంది’ అన్నారు. తాజాగా ఆప్‌లో చేరిన వారిలో మమతా వర్మ, వజీర్‌పూర్ నియోజకవర్గంకు చెందిన అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలున్నారు. కిరారీ నియోజకవర్గం నుంచి కూడా అనేకమంది నాయకులు, కార్యకర్తలు ఆప్‌లో చేరారు. ఇక బిజెపి విషయానికి వస్తే సుందర్ నగరి అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ భూమికా సింగ్ తన మద్దతుదారులతో ఆప్‌లో చేరారు. దీంతో ఢిల్లీ ఎన్నికలకు ముందే ఆప్ కేడేర్‌బేస్‌కు ఉద్దీపన లభించినట్లయింది. 70 మంది సభ్యులుండే ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.
ఢిల్లీలో బ్లాక్ స్థాయి కాంగ్రెస్: బిజెపి నాయకులు ఆప్‌లో చేరిక
- Advertisement -
- Advertisement -
- Advertisement -