Wednesday, December 25, 2024

స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు చెక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇకపై మొబైల్ వినియోగదారులకు అనవసర కాల్-, మెసేజ్‌లు రావు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్ ) ఎట్టకేలకు నకిలీ కాల్స్, ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించి నిబంధనల్లో మార్పు చేసింది. ఈ నిబంధనలు మే 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దేశంలోని మూడు ప్రధాన నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ఐడియాలు స్పామ్ కాల్‌లను నిరోధించడానికి వారి సిస్టమ్‌లో ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేశాయి. ఎఐ సహాయంతో నెట్‌వర్క్‌లోనే స్పామ్ సందేశాలు, కాల్‌లు బ్లాక్ అవుతాయని కంపెనీలు పేర్కొంటున్నాయి.

ఈ నిబంధనలను అమలు చేసేందుకు టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చింది. కంపెనీల ట్రయల్ రన్ విజయవంతమైందని ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్రాయ్ ఇంతకు ముందు కూడా డిఎన్‌డి (డోంట్ డిస్టర్బ్) సేవను ప్రారంభించింది. అయినప్పటికీ వినియోగదారులకు స్పామ్ కాల్స్, మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. దీనిపై ట్రాయ్ అధికారి మాట్లాడుతూ- డిఎన్‌డి సేవ తర్వాత కూడా స్పామ్ కాల్-మెసేజ్‌లు వస్తూనే ఉన్న మాట వాస్తవమే, అయితే వాటి సంఖ్య భారీగా తగ్గింది. డిఎన్‌డి సేవ నెట్‌వర్క్‌లోనే కాల్ బ్లాకింగ్ సిస్టమ్‌ను కలిగి లేదు. కానీ ఇప్పుడు స్పామ్ కాల్‌లను బ్లాక్ చేయడం సులభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News