Sunday, January 19, 2025

కొత్త ఇసిల నియామకాలపై కేంద్రాన్ని అడ్డుకోండి

- Advertisement -
- Advertisement -

త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు జరగాలి

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత పిటిషన్

న్యూఢిల్లీ : కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని 2023లో తీసుకువచ్చిన చట్టం ప్రకారం చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం ఒక పిటిషన్ దాఖలైంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ గతంలో టిపిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ సోమవారం మరో పిటిషన్ దాఖలు చేశారు.

ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం, మరో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ కావడంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఇతర ఎన్నికల కమిషన్ల నియామాకాలకు సంబంధించి కేంద్ర ప్రభ ఉత్వం 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ జయా ఠాకూర్ గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. పెండింగ్ ఉన్న తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జనవరి 12న నోటీసులు జారీచేసిందని, అయితే ఇంతలోనే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ 2024 మార్చి 9న రాజీనామా చేయగా దాన్ని రాష్ట్రపతి ఆమోదించినట్లు ప్రకటన విడుదల వెలువడిందని తన తాజా పిటిషన్‌లో జయా ఠాకూర్ తెలిపారు.

త్వరలోనే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని వెంటనే చేపట్టవలసి ఉందని ఆమె తెలిపారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు 2023 మార్చి 2న అనూప్ బారన్‌వాల్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ నియామకాలను చేపట్టాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొందని ఆమె తెలిపారు. దీని ప్రకారం వెంటనే ఎన్నికల కమిషనర్ల నియామకాలు చేపట్టాలని ప్రతివాదులను(కేంద్ర ప్రభుత్వం) ఆదేశించాలని ఆమె సుప్రీంకోర్టును తన పిటిషన్‌లో అర్థించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News