Sunday, December 22, 2024

రాబోయే బిగ్ బాస్ షోను అడ్డుకోండి

- Advertisement -
- Advertisement -

కళాకారులకు సిపిఐ నారాయణ పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్ : కళ అనేది ప్రజాస్వామ్యాన్ని చైతన్యపరిచే విధంగా ఉండాలని, కానీ బిగ్ బాస్ లాంటి నేర పూరిత షో వలన సమాజం చెడిపోతున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. రాబోయే బిగ్ బాస్ షోను కళాకారులందరూ కలిసి ధ్వంసం చేయాలని పిలుపు నిచ్చారు. దేశ వ్యాపితంగా కళారంగాన్ని నాశనం చేసేది మోడి అయితే బిగ్ బాస్ లాంటి షో వలన సమాజం చెడిపోతున్నదని అన్నారు. కళ.. కళ కోసం కాదు కళ ప్రజల కోసం అనే నినాదంతో తెలంగాణ ప్రజా నాట్యమండలి పనిచేస్తున్నదన్నారు.

ఈ మేరకు శనివారం ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ ఆధ్వరంలో దేశ వ్యాపితంగా జరుగుతున్న జాతాలో భాగంగా రాష్ట్రంలో రెండు రోజులు పాటు ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో జాతా జరుగనుంది. ఈ సందర్భంగా డా. కె. నారాయణ ట్యాంక్ బండ్ మఖ్దూం మొహినోద్దీన్ విగ్రహం వద్ద నివాళులర్పించి, డప్పు కొట్టి జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఈ రెండు రోజుల పాటు జరుగు ప్రజానాట్యమండలి జాతా విజయవంతం కావాలని, ప్రజలందరూ స్వాగతించాలని కోరారు. నవయుగ, విప్లవ కవి శ్రీశ్రీ విగ్రహానికి ప్రజాకళా కారులు పాటలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా , విఎస్ బోస్, ఛాయ దేవి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News