Monday, January 20, 2025

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’..

- Advertisement -
- Advertisement -

లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ చిత్రాన్ని నిర్మించారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అర్జున్ దాస్ హీరోగా, దుస్సారా విజయన్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఎస్.ఆర్ డి.ఎస్ సంస్థ చిత్రాన్ని విడుదల చేయనుంది.. ప్రముఖ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ నాలుగు అద్భుతమైన పాటలు అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు వసంత బాలన్ మాట్లాడుతూ “తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌డిఎస్ బ్యానర్‌పై డి.శ్రీనివాస్ రెడ్డి, సునీల్ కుమార్ తెలు గు ప్రేక్షకులకు అందిస్తున్నారు. బ్లడ్ అండ్ చాక్లె ట్ సినిమాలో ప్రేమ, అభిమానం, మంచి ఎమోష న్స్ ఉంటాయి”అని అన్నారు. నిర్మాత దేవసానిశ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ‘ఈ సినిమాను మా ఎస్‌ఆర్‌డిఎస్ బ్యానర్‌లో విడుదల చేస్తుండడంపై సంతోషంగా ఉన్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా ఇది”అని తెలిపారు. కార్యక్రమంలో అర్జున్ దాస్. దుస్సారా విజయన్, వనితా విజయ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News