లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే పంథాలో డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్‌లో మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్ చిత్రాన్ని నిర్మించారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన అర్జున్ దాస్ హీరోగా, దుసరా విజయన్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఎస్.ఆర్ డి.ఎస్ సంస్థ చిత్రాన్ని విడుదల చేయనుంది.. ప్రముఖ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ నాలుగు అద్భుతమైన పాటలు అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో…
డైరెక్టర్ వసంత బాలన్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ శంకర్‌గారి సమర్పణలో రూపొందిన చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్’. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.డి.ఎస్ బ్యానర్‌పై డి.శ్రీనివాస్ రెడ్డి, సునీల్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. టైటిల్ విషయానికి వస్తే బ్లడ్ అండ్ సాధారణంగా మనకు వయొలెన్స్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే బ్లడ్ అండ్ చాక్లెట్ అండ్ ప్రేమ, అభిమానం. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. అర్జున్ దాస్ హీరోగా నటించారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. ఆయన రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యాంగ్రీ యంగ్ మేన్‌గా అన్నీ ఎలిమెంట్స్‌ను ఆయన అద్భుతంగా పండించారు.
జి.వి.ప్రకాష్‌గారిని నేను వెయిల్ అనే సినిమాతో పరిచయం చేశాను. అప్పుడే తను గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడనిపించింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్ గెలుచుకోవటంతో పాటు వంద సినిమాలను కంప్లీట్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీలో జీవీ నాలుగు పాటలకు సంగీతాన్ని అందించారు. అర్జున్ దాస్ ఈ సినిమా తర్వాత చాలా పెద్ద హీరోగా పేరు తెచ్చుకుంటారు’’ అన్నారు.
మాటల రచయిత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘అర్జున్ దాస్ గొప్ప వాయిస్‌తో అద్భుతంగా నటించారు. తనకు తెలుగులో ఎవరు డబ్బింగ్ చెబుతారా? అని నేను ఆలోచిస్తుంటే తెలుగులోనూ ఆయనే డబ్బింగ్ చెబుతానని ముందుకు రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. శంకర్‌గారు ఈ సినిమాను సమర్పించడానికి ముందుకు రావటంతో సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వసంతబాలన్ గారు గొప్ప దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ అద్భుతమైన పాటలను అందించారు’’ అన్నారు.
వనితా విజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘నేను తమిళంలో డబ్బింగ్ చెప్పటానికి వెళ్లినప్పుడు తెలుగు డబ్ అని అక్కడ ఉండటాన్ని చూసి నాతో ఎందుక తెలుగు డబ్బింగ్ చెప్పించలేదని అన్నాను. వేరే వాళ్లతో తెలుగు డబ్బింగ్ చెప్పించి ఉంటే మళ్లీ నేనే తెలుగులోనూ డబ్బింగ్ చెప్పాను. మళ్లీ పెళ్లి సినిమాతో రీసెంట్‌గానే మంచి సక్సెస్‌ను అందుకున్నాను’’ అన్నారు.
నిర్మాత దేవసాని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ‘‘‘బ్లడ్ అండ్ చాక్లెట్’ సినిమాను మా ఎస్.ఆర్.డి.ఎస్ బ్యానర్‌లో రిలీజ్ చేయటంపై చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సినిమాను అందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరుతున్నాను’’ అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘‘18 ఏళ్ల ముందు ఎస్ పిక్చర్స్ బ్యానర్ నుంచి ఎస్.కె.పిక్చర్స్ బ్యానర్ పుట్టింది. కాదల్ సినిమాను తెలుగులో ప్రేమిస్తేగా రిలీజ్ చేశాను. ఆ సినిమాకు పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి.. నాకు పెద్ద లాభాలను తెచ్చి పెట్టింది. తర్వాత వసంత బాలన్‌గారు రూపొందించిన అంగాడి తెరు అనే సినిమాను షాపింగ్ మాల్ పేరుతో విడుదల చేసి హిట్ కొట్టాం. వసంత బాలన్‌గారికి నేను పెద్ద అభిమానిని. జీవీగారు అద్భతమైన సంగీతాన్ని అందించారు. డైలాగ్ రైటర్ రాజశేఖర్ రెడ్డిగారికి, పాటల రచయిత మోహన్‌కి అభినందనలు’’ అన్నారు.
హీరోయిన్ దుస్సారా విజయన్ మాట్లాడుతూ ‘‘నేను తమిళంలో చేసిన సారపట్టా పరంపర సినిమా తమిళంలో చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగు నేర్చుకుని ఇక్కడ సినిమా చేస్తాను. ఇప్పుడు అర్జున్ దాస్‌తో కలిసి చేసిన బ్లడ్ అండ్ చాక్లెట్ మూవీ త్వరలోనే మీ ముందుకు రానుంది. అర్జున్ చాలా మంచి కోస్టార్. వనితా విజయ్ కుమార్‌గారితో కలిసి వర్క్ చేయటం హ్యాపీ. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
హీరో అర్జున్ దాస్ మాట్లాడుతూ ‘‘నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వసంత బాలన్‌గారితో కలిసి పని చేయటం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. తెలుగు ప్రేక్షకులు నన్నెంతగానో ప్రోత్సహిస్తున్నారు. బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమా విషయంలోనూ మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దుస్సారా విజయన్‌గారికి థాంక్స్. సినిమాలో వర్క్ చేసిన వనితా విజయ్ కుమార్‌గారు సహా ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్’’ అన్నారు.