Monday, December 23, 2024

బ్లడ్ బ్యాంక్‌లు సీజ్

- Advertisement -
- Advertisement -

అక్రమంగా ప్లాస్మా దందా చేస్తున్న బ్యాంక్‌లు
దాడి చేసి పట్టుకున్న డ్రగ్ కంట్రో అధికారులు

హైదరాబాద్: అక్రమంగా ప్లాస్మా దందా చేస్తున్న రెండు బ్లడ్ బ్యాంక్‌లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ప్లాస్మా భారీగా నిల్వ చేశారని సమాచారం రావడంతో శుక్రవారం ఔషధ నియంత్రణ అధికారులు దాడులు చేశారు. ల్యాబొరేటరీస్‌లో అక్రమంగా నిల్వ చేసిన హ్యూమన్ ప్లాస్మా, హోల్ హ్యూమన్ బ్లడ్, హ్యూమన్ సీరోమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మదీనగూడలోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ సెంటర్, దారుల్‌షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్‌ను సీజ్ చేస్తూ ఔషద నియంత్రణ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఔషధ నియంత్రణ సంస్థ అధికారులకు అందిన సమాచారం మేరకు ముసాపేటలోని హేమో సర్వీస్ ల్యాబొరేటరీస్ కంపెనీపై దాడి చేశారు. ఫ్రీజర్స్‌లో నిల్వ చేసిన బ్లడ్ ప్యాకెట్లు, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్రరావు నాయక్ అనే వ్యక్తి గత 8 ఏళ్లుగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తునట్లు తేల్చారు. మదీనాగూడలోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, దారుల్‌షిఫాలోని న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూల్‌లోని ఆర్‌ఆర్ బ్లడ్ బ్యాంక్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన బ్లడ్ బాటిల్స్‌ను మూసాపేటలోని భవానీ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో నిల్వ చేస్తున్నారు.

వాటిని మళ్లీ ప్యాక్ చేసి విశాఖపట్నంలోని అక్టిమస్ బయోసైన్సస్ ప్రైవేట్ లిమిటెడ్, బాలానగర్‌లోని క్యాయిన్స్ ల్యాబ్, పుణెలోని క్లినోవి రీసర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూర్‌లోని జీ7 సినార్జాన్ ప్రైవేట్ లిమిటిడెట్, మైక్రోల్యాబ్స్, నార్‌విచ్ క్లినికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బాలనగర్‌లోని క్యూపియస్ బయోసర్వ్ ప్రైవేట్ లిమిటెడ్, మల్లాపూర్‌లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదినాగూడలోని జనరైజ్ క్లినికల్ రీసర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్‌టా ల్యాబ్స్ లిమిటెడ్‌లకు విక్రయిస్తున్నాడు. రాఘవేంద్రనాయక్ ఇతర బ్లడ్ బ్యాంక్ నుంచి 150 ఎంఎల్ హ్యూమన్ ప్లాస్మా బ్యాగ్‌ను రూ.700కు కొనుగోలు చేసి, దానిని తిరిగి ప్యాకింగ్ చేసి ఇతర కంపెనీలకు రూ.3వేలకు విక్రయిస్తున్నాడు. 2016 నుంచి 6 వేల యూనిట్ల కంటే ఎక్కువ రక్తాన్ని సేకరించి, విక్రయించినట్టు అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News