తాజా అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : ఆస్ట్రాజెనెకా, జె అండ్ జె, స్పుత్నిక్ వి వంటి టీకాలు తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టినట్టు కొన్ని కేసులు ప్రపంచ దేశాల్లో నమోదయ్యాయి. దీనిపై పరిశోధకులు కారణాలేమిటో పరిశీలించడానికి జర్మనీ , ఇటలీ దేశాల్లో ఎలుకలపై అధ్యయనం చేశారు. జర్మనీ లోని మునిచ్ యూనివర్శిటీ , ఇటలీ లోని రీసర్చ్ ఇన్సిస్టిట్యూట్ ఈ అధ్యయనం చేపట్టాయి. అడినోవైరస్ నుంచి ఈ కొవిడ్ టీకాలను రూపొందించినందున వీటిని సరైన రీతిలో ఇవ్వకుంటే అంటే చేతి భుజానికి టీకా ఇచ్చేటప్పుడు సరైన రీతిలో ఇంజెక్షన్ గుచ్చకుంటే దాని వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నట్టు నిర్ధారించారు. నేరుగా రక్తనాళాల్లోకి టీకాలను ఇవ్వడం వల్ల త్రాంబాటిక్ త్రాంబోసైటోపెనిక్ సిండ్రోమ్ (టిటిఎస్) లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయని అధ్యయనంలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొవిడ్‌పై ఏర్పాటు చేసిన ఐఎంఎ నేషనల్ టాస్క్‌ఫోర్స్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ దీని గురించి వివరించారు. టీకా ఇస్తున్న సమయంలో ఒక వేళ సూది భుజం లోతులోకి వెళ్లకున్నా లేక రక్తనాళం లోకి నేరుగా వెళ్లినా , దాని వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు.
Blood clots if Covid vaccine is not given properly