Friday, November 22, 2024

కొవిడ్ రోగుల్లో రక్తం గడ్డకట్టడానికి యాంటీబాడీల తీవ్ర స్పందనే కారణం

- Advertisement -
- Advertisement -

Blood clots in Covid patient linked to abnormal antibody response: Study

బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడి

లండన్: కొవిడ్ తీవ్రంగా ఉన్న రోగుల్లో రక్త నాళాల వాపు, రక్తం గడ్డకట్టడానికి యాంటీబాడీల అసాధారణ స్పందనే కారణమని, యాంటీబాడీలు వైరస్‌తో పోరులో ఊపిరి తిత్తుల్లో అనవసరంగా పేట్లెట్ చర్యను ప్రేరేపించడం వల్లనే ఇదంతా జరుగుతుందని బ్రిటన్ పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చారు. బ్రిటన్ లోని ఇంపీరియల్ కాలేజీ లండన్, యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. జర్నల్ బ్లడ్‌లో ఈ అధ్యయనం వెలువడింది. వివిధ ఔషధాల నుంచి వెలువడే మూలకాల ప్రభావం రక్తంపై ఉంటుందని, దీనివల్ల రక్తం లోని పేట్లెట్ల సంఖ్యను తగ్గించడం కానీ, లేదా ఆపడం కానీ జరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. రక్తం చిమ్మకుండా గడ్డ కట్ట డానికి ప్లేట్లెట్లు ఉపయోగపడతాయి. ఇవి చిన్న కణాల రూపంలో రక్తంలో ఉంటాయి. అయితే పేట్లెట్ల అసాధారణ చర్య పక్షవాతానికి, గుండె పోటుకు దారి తీస్తాయి. కొవిడ్ కు అడ్డుకట్ట వేయడానికి ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ప్లేట్లెట్‌ల చర్య ను ప్రేరేపించేలా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే కణాలను ప్రోత్సహిస్తాయి.

దానివల్ల అక్కడ మాన్పడానికి గాయం అంటూ ఏదీ లేకపోయినా రక్తం గడ్డ కట్టేలా చేస్తాయని పరిశోధకులు వివరించారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు తీవ్రమైన కొవిడ్ బాధితు ల నుంచి యాంటీబాడీలను సేకరించి వాటి నకలును లేబొరేటరీలో తయారు చేశారు. ఆరోగ్యవంతులైన దాతల రక్తకణాలపై ఈ నకలు యాంటీబాడీలను ప్రయోగించారు. దీంతో పేట్లెట్ల చర్య పెరగడాన్ని గమనించారు. ఇమ్యూన్ వ్యవస్థ సమస్యలను నయం చేయడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధాల వల్ల అసాధారణ పేట్లెట్ల ప్రతిస్పందనను తగ్గించడం లేదా నిరోధించడం జరుగుతుందని పరిశోధకులు గమనించారు. ప్రయోగశాలలో ప్లేట్లెట్ల అధ్యయనం వల్ల తీవ్ర కొవిడ్ రోగుల్లో ఏ విధంగా, ఎందుకు ప్రమాదకరమైన రక్తం గడ్డకట్టడం జరుగుతుందో అలాగే దీన్ని ఎలా నివారించ వచ్చునో కూడా తెలిసిందని పరిశోధకులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News